వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘‘నారసింహ వారాహి గణం’’..
అమరావతి: జగన్ ప్రభుత్వం హయంలో కనీస హాక్కులను అణిచివేస్తున్న సమయంలో బలమైన పోరాటం చేసి,ప్రజల హాక్కుల కోసం నిలబడడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.శుక్రవారం గోపాలపురం నియోజకవర్గంలో ద్వారక తిరుమల మండలం, ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా దీపం-2 కార్యక్రమంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం..ఏ పని అయినా అవుతుందో లేదో అధికారులతో చర్చించిన తర్వాత ప్రజలకు మాట ఇస్తాను..ప్రతీ ఏడాది నిరుద్యోగ యువతకు డీఎస్సీ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించాం. వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు. వైసీపీకి 11 సీట్లువచ్చినా విమర్శలు మానలేదు.3 నెలలుగా వైసీపీ నేతలకు నోరు ఎక్కువైంది. ఇది మంచి ప్రభుత్వమే కానీ, మెత్తని ప్రభుత్వం కాదు. మీకు యుద్ధమే కావాలనుకుంటే సిద్ధమే.. కానీ అభివృద్ధికి ఉపయోగపడే యుద్ధం కావాలన్నారు. పోలీసులకు డిజిటల్ క్రైమ్ యాక్టు తీసుకురాబోతున్నాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్:- ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథ పురం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నేలపై అందరూ నివసిస్తున్నారని,, తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మన సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాలకు వెళ్లినపుడు కొన్ని విలువలు పాటించాలని సూచించారు. ఐయస్ జగన్నాధపురంలోనే మన సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచిగా ఉండాలని దీక్ష చేపట్టానని గుర్తుచేశారు. సనాతన ధర్మం పాటించడం వల్లే ఈ దేశం నిలబడదని ఉద్ఘాటించారు. హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పడితే, సహించేది లేదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని జనసేన పార్టీ తరపున ప్రారంభిస్తున్నామని తెలిపారు.‘‘నారసింహ వారాహి గణం’’ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఏపీ, తెలంగాణాలో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.