రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలోని టాప్ 5 సిటీల్లో ఒకటిగా అమరావతి-మంత్రి నారాయణ
అమరావతి: గత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేసిందని,, రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలోని టాప్ 5 సిటీల్లో ఒకటిగా అమరావతి తిరిగి నిర్మిస్తామని మునిసిపాల్ శాఖ మంత్రి పొంగూరు.నారాయణ చెప్పారు..సోమవారం సీ.ఎం అధ్యక్షతన సీఆర్డీయే 39వ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు..ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 29 న ఇంజినీర్ల తో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశాం..గతంలో నిలిచిపోయిన పనుల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబర్ 29 న నివేదిక ఇచ్చింది..పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఎలా పిలవాలని 23 అంశాలతో నివేదిక ఇచ్చారు.. కమిటీ ఇచ్చిన నివేదిక ను అధారిటీ ఆమోదించింది.. కొత్తగా టెండర్లు పిలవాలని అధారిటీ నిర్ణయించింది..అధారిటీ నిర్ణయంతో CRDA కమిషనర్ ఏజెన్సీలతో మాట్లాడి టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తారు..డిసెంబర్ నెలాఖరుకు టెండర్లు దాదాపు పూర్తి చేస్తాం..అసెంబ్లీ,హై కోర్టు ఐకానిక్ భవనాలకు జనవరి నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేస్తాం..ప్రపంచ బ్యాంకు 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది..సీడ్ కేపిటల్ లో 48 కిమే మేర కాలువలు పూర్తి కావస్తున్నాయి..కేపిటల్ సిటీ వెలుపల రెండో దశలో వరద నివారణ పనులు చేపట్టాలి..వరద నివారణ పనులకు నెదర్లాండ్స్ నివేదిక ఇచ్చింది..రెండో దశ వరద నివారణ పనులకు సమగ్ర నివేదిక తయారీకి అధారిటీ ఆమోదం తెలిపింది..అమరావతి చుట్టూ బైపాస్ రోడ్లు వచ్చినా ఔటర్,ఇన్నర్ రింగ్ రోడ్లు ఉంటాయని మంత్రి తెలిపారు.
పీఠాపురంలో డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణను విలేఖర్లు ప్రశ్నించగా అందుకు మంత్రి స్పందిస్తూ డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ సూచనతో హోంమినిస్టర్ దానికి తగ్గట్లుగా అధికారులతో వ్యవహరిస్తారు..హోంశాఖ అయన తీసేకుంటాను అని చెప్పలేదు,,నేనే అయితే అన్నారు..జరిగిన కొన్ని సంఘటనలపై లీగల్ గా పోలీసులు చేయడానికి కొన్ని సమస్యలు వుండవచ్చని,,అలాంటి ఏవైన వుంటే వాటిని సరిచేసుకుని, ఇంకా వేగంగా చర్యలు తీసుకొవడానికి ప్రయత్నిస్తారని అన్నారు.