DEVOTIONALDISTRICTSOTHERS

కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు గణేష్ ఘాట్ వద్ద కార్తీక దీపోత్సవం-ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: ఈనెల 15వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు సింహపురి కార్తిక దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు గణేష్ ఘాట్ వద్ద జరిగే మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఈ కార్తీక మహా దీపోత్సవం నాడు గణేష్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన శివునికి ఉదయం నుండి అభిషేకాలు పూజలు వుంటాయని చెప్పారు..సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే మాట్లాడుతూ అదే రోజు సాయంత్రం 5 గంటలకు మహిళలుతో శోభాయాత్ర నిర్వహిస్తారని,,6 గంటలకు గంగా హారతి ఉంటుందని, ఈ గంగా హారతి హరిద్వార్ లో గంగా హారతి ఇచ్చే అర్చకులచే నిర్వహిస్తామన్నారు.. అనంతరం స్వర్ణాల చెరువులో తెప్పలతో శివాకృతి ఏర్పాటు చేస్తారని తెలిపారు.. ఈ కార్యక్రమాలన్నీ కన్నుల పండుగగా ఎంతో వైభవంగా నిర్వహిస్తారని,, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *