చింతారెడ్డిపాలెం వద్ద 5 లక్షల రూపాయల విలువ చేసే ఆవు మాసం సీజ్
ప్రతి వారం నెల్లూరుజిల్లా నుంచి అవు మాంసం మద్రాసుకు ఎగుమతి కావడం అలాగే మద్రాసు నుంచి కుళ్లుపోయిన చికెన్ దిగుమతి కావడం సర్వసాధరణ జరుగుతున్న తంతు..గతంలో హెల్త్ ఆఫీసర్ కుళ్లిపోయిన చికెన్ కంటైనర్ ను గూడూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా పట్టుకున్నారు..పై రెండు రకాల మాంసంలను తరలించడం చట్ట రీత్యా నేరం….ఈ తంతు ఎవరి సహకారంతో యధేఛ్చగా జరుగుతుందొ కొన్ని డిపార్ట్ మెంట్స్ అధికారులకు తెలిసిందే కదా అన్న వ్యాఖ్యలు నగర ప్రజల నుంచి వస్తున్నాయి..మరి అధికారులు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తారా??? లేక తంతు తూతూ మంత్రంగా సాగుతుందా?.?
నెల్లూరు: నగరంలో పరిధిలోని స్థానిక 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం దగ్గరలోని రాజుపాలెం వద్ద ఆవు మాంసం కార్పొరేషన్ అధికారులు పట్టుకున్నారు.. శనివారం పక్క సమాచారం అందుకున్ననగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ లు పోలీసు వారి సహకారంతో సీజ్ చేశారు..ఎటువంటి అనుమతులు లేకుండా షుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే, 4 టన్నుల బీఫ్ మాంసంను కంటైనర్ లో తరలించేందుకు సిద్ధంగా వున్న సమయంలో అధికారులు దాడులు చేశారు..అనంతరం అధికారులు మాట్లాడుతూ పట్టుకున్న మాంసంకు సంబంధించిన యజమానిని విచారించగా ఎటువంటి అనుమతులు లేవని తెలిందన్నారు..దింతో సీజ్ చేసిన మాసంను, దొంతాలి కంపోస్ట్ యార్డుకు తరలించి నిర్వీర్యం చేస్తామని తెలిపారు..ఈ నగరపాలక సంస్థ సానిటరీ సూపర్వైజర్ నరసింహారావు,, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.