ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి కోట్లలో ప్రోత్సాహం-సీ.ఎం చంద్రబాబు
క్రీడా కోటా రిజర్వేషన్ పెంపు..
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు..అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపి స్టోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని,,“స్పోర్ట్స్ ఫర్ ఆల్” అనే విధానంతో తీసుకువచ్చిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో పాలసీని సిద్ధం చేశారు.. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు..ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు..క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి:- ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. యూనిఫాం సర్వీసెస్ లో 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు..శాప్ లో గ్రేడ్ 3 కోచ్ ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు..
పతకాలు సాధించే క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు:- పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు..ఆటలు ఆడేవాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు.. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, దీన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.5 కోట్లు,, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు..అలాగే ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు..అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు,,రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు,, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు.. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు.. వరల్డ్ ఛాంపియన్ ఫిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు,, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు,, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు.. నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి రూ.10 లక్షలు,, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు,, కాంస్య పథకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు.. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు,, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు,, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.. ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు.. అదే విధంగా స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు..కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.. రాష్ట్రనికి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయని,,మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్ప్రోర్ట్, నేచర్ ఫోటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు..ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని,,అన్ని ఆటలను ప్రోత్సహించాలని సిఎం అన్నారు..ఆటలను తమ లక్ష్యంగా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని,,ఎక్కువ మంది ఆ వైపు మొగ్గు చూపుతారని సిఎం అన్నారు..పిపిపి విధానంతో పాటు స్వచ్చంధంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.. ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,,శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.