పరిస్థితులు ఇలాగే వుంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది- డిప్యూటీ సీఎం పవన్
క్రిమినల్స్ కు కులం, మతం ఉండదు..
అమరావతిం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహిళలు,చిన్నపిల్లలపై జరుగుతున్న ఆత్యాచారలు,,హాత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు..క్రిమినల్స్ కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు.. ఇటీవల జరుగుతున్న ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ లైంగికదాడికి తెగబడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.. ఆ ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని సూచించారు..సంబంధిత శాఖల మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని,, మీరు క్రీయశీలకంగా లేకుంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని అన్నారు..పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు..జిల్లా స్థాయిలో కలెక్టర్లు,,ఎస్పీలు తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని,,శాంతి భద్రతలు లొపిస్తే రాష్ట్రం అభివృద్ది కుంటుపడుతుదన్నారు.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి..హోం మంత్రి పదవి చేపట్టిన తరువాత వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వద్ద ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే..అయినప్పటికీ క్రిమినల్స్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఇదే సమయంలో వ్యక్తుల స్వార్ధం కోసం ఎన్డీఏ కూటమిని విడతీయ్యలేరని స్పష్టం చేశారు.
తొలుత గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..పిఠాపురం నియోజకవర్గంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాలు, మూడు చక్రాల సైకిల్స్ తో పాటు దివ్యాంగులకు ఉపయుక్తమైన పరికరాలు డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు..