టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా ఎకగ్రీవంగాఎన్నిక
అమరావతి: టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకుంటూ ట్రస్ట్ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు..టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది..ఇందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉండగా, ఇందులో కీలకమైనవి రెండు..సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్…మరొకటి సర్ రతన్ టాటా ట్రస్ట్… ఈ రెండు ట్రస్టులకు కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఉన్నది.. ఐదు ట్రస్ట్ లకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉన్నది.. రతన్ టాటా మరణించే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు.. రతన్ టాటా మరణంతో టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు..టాటా ట్రస్ట్స్ చైర్మన్‌పై 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు..నోయెల్ టాటా…. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు.. ఆయన టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది.. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో పని చేశారు.. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకు ఆయన చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు..టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.