భారతీయ భోజన విధానంను అనుసరిస్తే భూగ్రహాన్ని కాపాడుకోవచ్చు-వరల్డ్ లైఫ్ వన్యప్రాణి నిధి
అమరావతి: భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి ( WWF) లివింగ్ ప్లానెట్ నివేదిక వెల్లడించింది..G20 దేశాలు ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార వినియోగం అత్యంత సుస్థిరమైనదని గురువారం విడుదలైన నివేదిక అభిప్రాయపడింది.. ప్రపంచ దేశాలన్నీ భారతీయ పద్ధతులను అనుసరిస్తే,, 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తిలో భూ గ్రహానికి అత్యంత తక్కువ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.. ఆర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఆహార వినియోగ విధానాలు అత్యంత హీనంగా ఉన్నాయని,, ఆయా దేశాల పద్ధతులు భూతాపాన్ని మరింత ప్రేరిపిస్తున్నాయని హెచ్చరించింది.. ఆహార వినియోగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాల బాటలో నడిస్తే 2050 నాటికి భూతాపం పరిమితిని మించి పెరిగిపోతుందని తెలిపింది.. ఆహార సంబంధిత ఉత్పత్తుల కారణంగా 2050 నాటికి వాతావరణం 1.5 డిగ్రీల సెల్షియస్ మేరకు పెరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది..ప్రస్తుత ఆహార వినియోగ విధానాల కారణంగా అది అంతకన్నా 263 శాతం పెరగవచ్చని,, అప్పుడు భూమిమీద ఉన్న వారికి మరో ఏడు భూగ్రహాలు అవసరమవుతాయని వెల్లడించింది..
భారతీయులను అనుసరిస్తే:- భారతీయుల భోజన వినియోగ విధానాలను అందరూ అనుసరిస్తే 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తికి ప్రస్తుత భూగ్రహంలో 0.84 శాతం సరిపోతుందని ఆ నివేదిక అంచనా వేసింది.. ఒకవేళ ప్రపంచమంతా అర్జెంటీనా ధోరణిని అనుసరిస్తే,, 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తికి మరో 7.4 భూగహ్రాలు అవసరమవుతాయని తెలిపింది.. ఆహార పదార్థాల ఉత్పత్తి సుస్థిరతలో అర్జెంటీనా అత్యంత బలహీనమైన విధానాన్ని కలిగి ఉన్నదని,, దాని తరువాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రిటన్ దేశాలున్నాయని పేర్కొంది.. అత్యుత్తమ ఆహార విధానాలు కలిగి దేశాల్లో భారత్ తరువాత ఇండొనేషియా, చైనా, జపాన్, సౌదీ అరేబియా ఉన్నాయని వివరించింది.
భారత ప్రభుత్వం చేపట్టిన మిల్లెట్ మిషన్:- భారత ప్రభుత్వం చేపట్టిన మిల్లెట్ మిషన్ (చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం)ను ఆ నివేదిక ప్రశంసించింది.. జొన్నలు, చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, సాధారణ భూముల్లో సైతం ఆ పంటలను పండివచ్చని,,అలాగే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఆ పంటను సాగుచేయవచ్చని పేర్కొంది.. పప్పు ధాన్యాలు, అత్యధిక పోషక విలువలుండే తృణ ధాన్యాలు, మొక్కల ఆధారంగా ఉత్పత్తి చేసే మాంసం ప్రత్యామ్నాయాలు, పోషకాలు అధికంగా ఉండే నీటిపాచి జాతుల వంటి వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ నివేదిక సూచించింది.