ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్ నియమకం
అమరావతి: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా Dr V.నారాయణన్‌ను నియమిస్తూన్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ప్రకటించింది.. జనవరి 14వ తేదిన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు..ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ Dr S.సోమనాథ్ పదవీ కాలం జనవరి 13వ తేదిన ముగియనుంది.. ఇస్రో కొత్త ఛైర్మన్ Dr V నారాయణన్ రెండేళ్లపాటు పదవిలో సేవాలు అందించనున్నారు..ఇప్పటివరకు ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ కు సారథ్యం వహించారు..గత 40 సంవత్సరాలుగా ఆయన ఇస్రోలో పనిచేస్తున్నారు.. రాకెట్‌తో పాటు స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో నారాయణన్‌కు అపారమైన అనుభవం ఉంది..తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వ్యక్తి నారాయణన్ IIT ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్ చదివారు..2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో Ph.d డిగ్రీ పొందారు.. నారాయణన్‌కు లిక్విడ్,,సెమీ క్రయోజెనిక్,, క్రయోజెనిక్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు..GSLV MARK-2తో పాటు 3 వాహక నౌకల అభివృద్ధిలోనూ,,ఆదిత్య L1తో పాటు చంద్రయాన్ 2,,చంద్రయాన్ 3 లోని చోదక వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయనది కీలక పాత్ర.