బుధవారం విశాఖలో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8వ తేదీ.. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు విమానంలో విశాఖకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు,, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు..అక్కడ నుంచి ప్రధానితో కలిసి చంద్రబాబు,, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు..రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ, ఆంధ్ర యూనివర్సీటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.. ఈ పర్యాటనలో వర్చువల్ గా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు,, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు..దాదాపు రూ. 1.85 లక్షల కోట్లు పెట్టుబడితో,, అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు సైతం ఆయన శంకుస్థాపన చేస్తారు..రాష్ట్రంలో చేపడుతున్న రూ.19,500 కోట్ల విలువైన రైల్వే,, రహదారి ప్రాజెక్టులకు సంబంధించి పలు పనులకు,,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ కు శంకుస్థాపన,,విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరగనున్నది.. 16వ జాతీయ రహదారిలో చిలకలూరి పేట ఆరు లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయనున్నారు..ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో భద్రతను కట్టుదిట్టం చేశారు..