వనరులు అవే,అధికారులూ వాళ్లే కాని వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: ఫిబ్రవరి 12వ తేది నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని,, గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు అన్న విషయం గుర్తుంచుకుని పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు..మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్షించారు..ఈ సందర్బంలో సీ.ఎం మాట్లాడుతూ గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని,, మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు..ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని,,అయితే ఈ సారి ఒకట్రెండు కాదు… ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తనకు తొలిసారి అని అన్నారు..రాష్ట్ర అర్దిక పరిస్థితిపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకుని,, 15 శాతం వృద్ధిరేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు.. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరముందని,,అయితే గతంలో వున్న వనరులు అవే… అధికారులూ వాళ్లే… కాని వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత అన్నారు.. 10 సూత్రాలను కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు..పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రులు, కార్యదర్శులకు దిశ నిర్దేశన చేశారు..