మహాకుంభమేళాకు వాహనల్లో భక్తులు పోటెత్తడంతో 300 కీ.మీ ట్రాఫిక్ జామ్
అమరావతి: మహాకుంభమేళా ప్రారంభం అయ్యి 26 రోజులు గడుస్తున్న భక్తుల సంఖ్య తగ్గక పోగా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతొంది.. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు…గత రెండు వారాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు వచ్చే భక్తులు సొంత వాహనాల్లో రావడంతో ట్రాఫిక్ పరిస్థితి గందరగోళంగా తయారు అవుతొంది..దింతో వల్ల భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు..దింతో ఆప్రమత్తమైన ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు..దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు..
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే జబల్పుర్-రేవా NH-30 రహదారిపై దాదాపు 300 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి..భారతదేశ చరిత్రలో ఈ విధమైన ట్రాఫిక్ జామ్ కావడం చాలా అరుదుగా కన్పిస్తుంది.. ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా రాజధాని బీజింగ్‌లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు..అప్పట్లో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.. 2012లో బ్రెజిల్‌లోని సావోల 300 కిలోమీటర్లు జామ్ కాగా వాహనదారులు 12-15 గంటలు ట్రాఫిక్‌లో పాటు చిక్కుకుపోయారు..ట్రాఫిక్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టారు.