గొడ్డు(బీఫ్) మాంసం విక్రయాలు,వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని ప్రభుత్వం, రాష్ట్రంలోని రెస్టారెంట్లు,, హోటలు,,బహిరంగ ప్రాంతాల్లో గొడ్డు(బీఫ్) మాంసం విక్రయాలు,, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది..బుధవారం అయన మీడియాతో మాట్లడుతూ తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.. రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం,, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం” అని సీ.ఎం హిమంత్ తెలిపారు.. దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని,, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.