పట్టుబడిన సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్,పాక్
అమరావతి: పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్‌ను బుధవారం విడుదల చేసింది..పహాల్గమ్ ఉగ్రదాడుల తరువాత పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన BSF జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు..20 రోజులపాటు పాక్‌లో బందీగానే వున్నారు..భారతదేశం నుంచి బలమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ఎట్టకేలకు మన జవాన్‌ను అట్టారిలోని చెక్ పోస్ట్ వద్ద భారత అధికారులకు అప్పగించారు..BSF జవాన్ పూర్ణబ్ కుమార్ షా పాకిస్థాన్ నుంచి తిరిగి రాగా మన సైనికుడికి బదులుగా భారతదేశం, రేంజర్ పికె షాను పాకిస్తాన్ కు అప్పగించింది.. ఏప్రిల్ 23న ఫిరోజ్‌పూర్‌లోని పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాక్ రేంజర్లు,, భారత సైనికుడి పూర్ణం కుమార్ సాహును అరెస్టు చేశారు..ఇది జరిగిర రెండు రోజల తరువాత రాజస్థాన్‌లోని భారత సరిహద్దు సమీపంలో BSF దళాలు ఒక పాకిస్తానీ రేంజర్‌ను పట్టుకున్నాయి..నేడు మన సైనికుడికి బదులుగా భారతదేశం, పాక్ రేంజర్‌ను కూడా పాకిస్తాన్‌కు అప్పగించింది.