మహా కుంభ్ పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వచ్చిన 66 కోట్ల మందికి పైగా భక్తులు
అమరావతి: ప్రయాగ్ రాజ్‌లో 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే మహా కుంభ్,,మహాశివరాత్రి(బుధవారం) నాడు భక్తుల శివ నామస్మరణలతో ముగిసింది..జనవరి 13వ తేదీన భోగి పండుగ నాడు ప్రారంభమై దాదాపు 45 రోజుల భక్త జన సంద్రమై సాగింది.. మహా కుంభ్ పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 66 కోట్ల మందికి పైగా భక్తులు,, ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం అచరించారు..ఈ మహాకుంభ్,3 గిన్నిస్ రికార్డులను నమోదు చేసుకొంది..
మహాకుంభమేళ పవిత్ర పర్వదినాలు పరిసమాప్తమైన వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.. ప్రపంచ చరిత్రలోనే ఇది అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు..ఈ మహా కుంభమేళ దిగ్విజయం నిర్వహించే అవకాశం తను లభించడం,పూర్వజన్మ సుకృతం అన్నారు.. అపూర్వమైన సంగమం పవిత్ర కార్యం విజయవంతం కావడానికి దార్శనికులు,,అఖడాలు,,సాధువులు,, అఘోరాలతో పాటు మత పెద్దల ఆశీర్వాద బలమేనని ఆయన స్పష్టం చేశారు..మహాకుంభ్ కు ప్రతిరోజూ 1.25 కోట్ల మంది భక్తులు తరలివచ్చారన్నారు..మహాకుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించడానికి దాదాపు 50 లక్షల మందికి పైగా విదేశీయులు ప్రయాగ్ రాజ్ తరలి వచ్చారని తెలిపారు..ఈ మహాకుంభమేళకు విచ్చేసిన భక్తుల్లో అమెరిక, చైనా, రష్యాలతోపాటు ఇతర దేశాలల్లోని ప్రజలు పవిత్ర స్నానాలు అచరించారని తెలిపారు.