బోర్డును మడత పెట్టేసిన సినార్జీ యూనివర్సల్ సాఫ్ట్ వేర్ కంపెనీ?
హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డును మడత పెట్టేసింది.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఈ కంపెనీ తాలుకు తంతు గురువారం వెలుగు చూసింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,,కావూరిహిల్స్ లోని వీవీ చాంబర్స్ నాలుగో అంతస్తులో ఉన్న సినార్జీ యూనివర్సల్ కంపెనీ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది.. అనంతరం బాధితులకు ఆఫర్ లెటర్ చేతిలో పెట్టి,,వర్క్ ఫ్రాం హోమ్ అని చెప్పి 6 నెలలు గడిపేసింది..ఇలా దాదాపు 500 మంది సాఫ్ట్ వేర్ డెవలపర్స్,,కోడింగ్ ప్రొగ్రామర్స్ అంటూ,వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది..గత ఆరు నెలల నుండి జీతాలను చెల్లించడం లేదని కంపెనీ యజమాన్యాన్ని ఉద్యోగులు ప్రశ్నించారు.. ప్రాజెక్టులు లేవని అందుకే జీతాలు చెల్లించలేకపోతున్నామని సినార్జీ తెలిపింది..ఇదే సమయంలో యజమాన్యం ఆఫీస్‌కు కూడా రావట్లేదు..దీంతో తాము మోసపోయామని గుర్తించిన ఉద్యోగులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..దాదాపు రూ.15 కోట్లతో పరారైన కంపెనీ ప్రతినిధులను పట్టుకునే పనిలో పోలీసులు తంటాలు పడుతున్నారు.. బాధితులు రూ.15 కోట్లలో ఉండడంతో EOW లో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు బాధితులకు సూచించారు..మరి ఈ కథ ఏ మలుపుత తిరుగుతుందొ??