బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి దాదాపు 102 టన్నుల బంగారాన్ని దేశంలోకి తీసుకుని వచ్చిన ఆర్బీఐ
అమరావతి: RBI మంగళవారం (ధన త్రయోదశి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి దాదాపు 102 టన్నుల బంగారాన్ని మన దేశంలోకి తీసుకుని వచ్చింది.. 1990లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పటి ప్రధాని (పీవీ నరసింహరావు) బంగారం కుదువ పెట్టి రుణాలు సేకరించింది..అటు దేశంలో ఆర్దికంగా కొంత మేర కొలుకున్నప్పటికి,,దేశంలో అంత మొత్తంలో బంగారం భద్రపర్చుకునే “చెస్ట్” లేక పోవడం,,ఇతర కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది..అలా నిల్వ చేసినందుకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఇంగ్లాడ్ కు చార్జీలు చెల్లించేది..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తీసుకుని వచ్చేస్తున్నారు..102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఉపయోగించి, భారత్‌కు తీసుకొచ్చింది..ప్రస్తుతం మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి..ఇంగ్లండ్‌లో దాదాపు మరో 325 టన్నులు పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది..
అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం,, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు,, అమెరికా ప్రతి విషయంలో దేశాలపైన “శాంక్షన్స్” విధిస్తున్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ భావిస్తోంది..బంగారం తరలింపు ప్రక్రియ సెప్టెంబరు 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది..ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో వున్న 325 టన్నుల బంగారు నిల్వలను ఆర్బీఐ ఎంత తొందరగా తరలిస్తుందో వేచిచూడాలి.