దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు అందరూ ఆనందగా వుండాలి
నెల్లూరు: విజయదశమి అంటే విజయానికి ప్రతీక అని, జిల్లా ప్రజలందరికి ఈ విజయదశమి సరికొత్త విజయాలు అందించాలని కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరవేస్తూ, అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమని, కష్టపడి పనిచేస్తే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయని, ప్రజలందరూ ఈ స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలన్నారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై పుష్కలంగా ఉండి అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు జాయింట్ కలెక్టర్ కార్తీక్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.