ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం-22 మంది మృతి
అమరావతి: ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో సోమవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 22 మంది మరణించారు..మృతుల సంఖ్య ఇంకా పెరిగేందుకు అవకాశం వున్నట్లు అధికారులు పేర్కొన్నారు..బస్సు కెపాసిటీ 42 సీట్లు కాగా దాదాపు 60 మందితో ప్రయాణికులతో లిఖ్వాల్ నుంచి రామ్‌నగర్ వెళ్తున్న సమయంలో మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది.. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.. సోమవారం ఉదయం 7.00 గంటల ప్రాంతంలో బస్సు గర్వాల్ నుంచి రాంనగర్‌కు వెళ్తుండగా అల్మోరాలోని కూపి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,,SDRF దళాలు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 22 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు..ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామీ,ఘటనపై అధికారులను వివరాలు తెలుసుకుని,,మృతుల కుటుంబలకు రూ.4 లక్షలు,,గాయపడిన వారికి రూ.1 లక్ష ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.