తమిళనాడులో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారు-నటి కస్తూరీ
తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు..
అమరావతి: అనుకున్న ఒకటి అయినది ఒకటి అన్న సమెత సినీనటీ,,తమిళనాడు బీజెపీ నాయకురాలు కస్తూరికి సరిపోతుంది..ఆదివారం తమిళనాడులో జరిగిన ఒక సభలో అమె, ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీని ప్రశ్నించే క్రమంలో తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ,, తెలుగు ప్రజలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.. కస్తూరి తెలుగులో అన్నమయ అలాగే తమిళంలో పలు చిత్రల్లో నటించింది.. సభలో అమె మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రిందట రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని,, అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది..ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది..
ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో 5గురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు.. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు… ఇతర భార్యలపై మోజుపడొద్దు…ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను వివాహాం చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు…ఇలా చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని వ్యాఖ్యనించింది..ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి..ఇందుకు సంబంధించి కస్తూరి తన ఎక్స్ ఖాతలో వివరణి ఇచ్చినప్పటికి,చర్చ అగలేదు.