జిల్లా అభివృద్దిపై సమస్యలు,,సూచనలు చేసిన మంత్రులు,ఎమ్మేల్యేలు
జిల్లా సమీక్ష మండలి సమావేశం..
నెల్లూరు: ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ సమావేశంలో అనేక ముఖ్యమైన శాఖల పనితీరును కూలంకషంగా చర్చించడం జరిగిందని, ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను ఆచరణ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉందని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి సగౌరవంగా ఆహ్వానం పలకడం పొరపాటు జరిగిందని, ఇది బాధాకరమైన విషయమని, దీనికి అందరం చింతిస్తున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
ఎంపీ వేమిరెడ్డికి అందరి తరపున క్షమాపణ చెబుతున్నాం-మంత్రి ఆనం:-డిఆర్‌సి సమావేశంలో ఎంపీ వేమిరెడ్డీ ప్రభాకర రెడ్డిని సగౌరవంగా ఆహ్వానించకపోవడంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందరి తరపున క్షమాపణలు చెప్పారు. ఇలాంటి లోపాలు మళ్ళీ జరగకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…త్వరలో జిల్లాలో ఎయిర్‌పోర్టు-మంత్రి నారాయణ:- దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు అవసరమని, వీలైనంత త్వరలో దగదర్తిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు, ఇందుకు ఢిల్లీలో చర్చించామని, కమిటీ కూడా పరిశీలనలకు వస్తుందన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై ఎస్పీకి ఆదేశాలిచ్చామని, చింతారెడ్డిపాలెం, కనుపర్తిపాడు కూడళ్ల వద్ద ఫ్లఓవర్ వంతెల నిర్మాణానికి ఇప్పటికే ఎన్‌హెచ్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు..జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు-కలెక్టర్ ఆనంద్:- జిల్లాలో వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు, ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో జల్‌జీవన్ మిషన్ పనులు, ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా రోడ్లను మరమ్మతులు చేపడుతూ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు..గత ఐదేళ్లలో అక్రమాలకు విచారణ చేపట్టండి-ఎమ్మెల్యే సోమిరెడ్డి:- గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇరిగేషనన పనులపై విచారణ చేపట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహననరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణను నిర్లక్ష్యం చేసిందన్నారు…లష్కర్లకు జీతాలు ఇవ్వండి-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి:- జిల్లాలో ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లష్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని, కొంతమందిని తొలగిస్తున్నారని, ఈ చిరుద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు… నెల్లూరు రూరల్‌లో మూడు బ్రిడ్జిల నిర్మించేందుకు చర్యలు చేపట్టండి-ఎమ్మెల్యే కోటంరెడ్డి:- నెల్లూరు పరిధిలో ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండేందుకు పొట్టేపాలెం కలుజు వద్ద, కొత్తూరు సమీపంలోని తెలుగుగంగ కార్యాలయం వద్ద, నెల్లూరు సమీపంలో ఇరుగాళమ్మ కూడలి వద్ద వంతెనలను నిర్మించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మూడు వంతెనలను నిర్మించేందుకు కృషి చేయాలని మంత్రులను కోరారు..రాళ్లపాడుకు 1.5 టిఎంసిల నీటిని విడుదల చేయాలి-కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి:- సోమశిల జలాశయం నుంచి రాళ్లపాడు రిజర్వాయర్‌కు 1.5 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు..యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టండి-ఎమ్మెల్యే కృష్ణారెడ్డి:- జిల్లాలో పిఎసిఎస్‌లు, మార్క్ ఫెడ్‌ల ద్వారా యూరియా సరఫరా చేయాలని, బయటమార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. వర్షాలకు చెరువులన్నీ నిండాయని, మేజర్ ఇరిగేషన్ పనులపై దృష్టిసారించాలని సూచించారు..ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మ,ఎమ్మేల్సీలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.