ఎలన్ మాస్క్ కొత్త రాజకీయ పార్టీ పేరు ‘ది అమెరికా పార్టీ’-జరిగే పనేనా?
అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు మధ్య కొన్ని రోజుల నుంచి అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు ఎడముఖం,పెడముఖకంగా వుంటున్నారు..మథ్య మథ్యలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు..దింతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది..మస్క్ ను దెబ్బకొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలు పెట్టిన నేపథ్యంలోనే ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని యోచిస్తున్నాను అని,, తన కొత్త రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు..
పార్టీ పెట్టడానికంటే ముందు మస్క్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.. ఎక్స్ ఖాతాలో ప్రజల అభిప్రాయంను సేకరించారు.. 80 శాతం మంది అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా? అని ప్రశ్నించారు.. జూన్ 5వ తేదీ రాత్రి 11.27 గంటలకు పోల్ పెట్టగా కొన్ని లక్షల మంది దానిపై స్పందించారు..ఇప్పటి వరకు 90.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. 56 లక్షలకు పైగా యూజర్లు ఓట్లు వేశారు..80.4 శాతం మంది అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని,, 19.6 శాతం మంది అవసరం లేదని ఓటు వేశారు..పోల్ తుది ఫలితాలపై శనివారం మస్క్ ఓ పోస్టు పెట్టారు.