పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్-నాలుగురు మృతి
అమరావతి: చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ (15904) గురువారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.. ఉత్తరప్రదేశ్ లోని గోండా-జిలాహి మధ్య ఉన్న పికౌరా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.. ప్రమాదం కారణంగా 12 బోగీలు పట్టాలు తప్పాయి.. ప్రమాదంలో నలుగురు మరణించగా, 20 మంది వరకు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం..పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు స్థానికుల సహాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు..15 అంబులెన్స్ లతో 40 మంది సభ్యుల వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది..సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..సహాయక చర్యలను ముమ్మరం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు..ప్రమాదానికి గల కారణాలపై విచారణకి రైల్వే శాఖ ఆదేశించింది..అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ప్రమాదంపై స్పందించారు..అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.. ప్రయాణికుల సహాయార్థం రైల్వేశాఖ హెల్స్ లైన్ నంబర్లను ప్రకటించింది.