ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును ఎకగ్రీవంగా అమోదించిన శాసనసభపక్షం
అమరావతి: బీజెపీ మహిళలకు రాజకీయాల్లో ప్రాధన్యత కల్సిస్తొంది అనేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఖరారు చేసింది..బుధవారం బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగడానికి ముందువరకు కూడా పది పేర్లు విన్పించినప్పటికి చివరికి రేఖాగుప్త పేరును ఎమ్మేల్యే ఎకగ్రీవంగా అమోదించారు.. డిప్యూటీ సీఎంగా న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేష్ వర్మ,, రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు.. రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉన్నరేఖా,, విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.. ఢిల్లీలోని పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరచితురాలు..సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే రేఖాగుప్తాకు,అమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది..విద్యార్థి దశలో ABVPలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆటు తరువాత బీజేపీలో చేరారు.. పితంపుర కౌన్సిలర్‌గా,, షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలుగా అమెకు పేరు వుంది.. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయడమే ఆమెను సీఎంగా బీజేపీ ఎంపిక చేయడానికి కారణం అయింది..బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు..అలాగే బీజేపీలో ఎన్నో బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తించారు..షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో ఓటమి చెందారు..2025 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బందనాకుమారిని 29 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.