బీజెపీ పాలనలో వున్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు-కేంద్ర మంత్రి అమిత్ షా
అమరావతి: ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్ పరిమితిని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోందని,,దేశంలో బీజెపీ అధికారంలో ఉన్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..శనివారం ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలములో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు..భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు లేవని పేర్కొన్నారు..కాంగ్రెస్పార్టీ మొదటి నుంచి ఓబీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దాన్ని అపహాస్యం చేశారని అమిత్ షా విమర్శిచాంరు..ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మత ఆధారిత రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించదని పేర్కొన్నారు.. రాహుల్ గాంధీ ఓ ఎన్నికల ర్యాలీలో రెండు రోజుల క్రితం రాజ్యాంగం కాపీని చూపించారని, అది నకిలీదని,,అందులో ఎలాంటి కంటెంట్ లేదని,,బుక్ కవర్పై మాత్రమే భారత రాజ్యాంగం అని రాసి ఉందన్నారు..ఇలాంటి చేష్టలతో రాహుల్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని,, నకిలీ రాజ్యాంగ ప్రతి చూపి రాహుల్,, బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్ను అవమానించారని మండిపడ్డారు..జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని,, గాంధీల నాలుగో తరం వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదు” అని అమిత్ షా తెలిపారు.