బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ప్రారంభం అయిన ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో
అమరావతి: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో బెంగళూరులో ప్రారంభం అయింది..భారతో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి..బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ ఫిబ్రవరి 10 నుంచి 14 తేది వరకు జరగనుంది..డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్,,IAF, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్&కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సహా పలు ఏజెన్సీల సహకారంతో ఏరో ఇండియాను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది..ఈ ఎయిర్ షో ప్రదర్శనకు “ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్” అనే థీమ్‌తో జరుగుతుంది..ప్రపంచదేశాల యుద్దవిమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా,, రష్యా,, అమెరికాపైనే ఉంది.ఈ షోలో అత్యంతధునిక టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా సిద్దం అయింది..రష్యా రూపొందించిన SU-57, అలాగే అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ 2,, భారతదేశం స్వదేశీ పరిజ్ఞనంతో రూపొందించిన “తేజస్ ఫైటర్ జట్” విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు..ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారులు తెలిపారు.. కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది..ఇప్పటి వరకు 14 సార్లు ఎయిర్ షోలు నిర్వహించగా ఇది 15వ ఎయిర్‌షో..ఇంత వరకు జరిగిన ఎయిర్‌షోలకు బెంగళూరే అతిథ్యమిస్తొంది.. ప్రదర్శన సమయంలో ఎలాంటి సమస్యలు తలేత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లును కేంద్ర బలగాలు చేశాయి..ఎయిర్ షో చూసేందుకు పలురాష్ట్రాల నుంచి వివిధ వర్గాల వారు బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.