కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతొంది- జ్యోతిరాదిత్య సింధియా
అమరావతి: అదానీ గ్రూప్‌పై ఏడాదిన్నర కిందట పనికిరాని ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ బ్లాక్ మెయిల్ సంస్థ తాజాగా కొత్త నాటకంకు తెర తీసింది..(అదాని గ్రూప్ పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని సుప్రీం కోర్టు తీర్చు ఇచ్చిన,,సిగ్గు లేకుంగా నేడు) ఇందులో భాగంగా అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయని బ్లాక్ మెయిల్ రిపోర్ట్ లో పేర్కొంది.
అమెరికాలో 10 మందితో తయారు అయిన ఒక అనామక సంస్థ,,లక్షల మంది మదుపరులు విశ్వసిస్తూన్న సంస్థపైన చవకబారు ఆరోపణలు చేయడం,, అలాంటి చెత్త ఆరోపణలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీడియా ముందుకు రావడం దారుణమైన విషయం….భారతదేశం ఆర్దికంగా బలపడుతున్న వైనంను,, ప్రపంచలోని ఆగ్రదేశాలు అని చెప్పకుంటున్న దేశాలకు మింగుడు పడడం లేదు..భారతదేశంపై ఎదో ఒక రకంగా బురద చల్లి,,స్టాక్ మార్కెట్లను దెబ్బతిసేందుకు ప్రయత్నిస్తునే వున్నాయి..అలాంటి సంస్థలకు ఒత్తసు పలుకుతూ,,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,,ఆర్దరహితమైన డిమాండ్లు చేస్తు,,దేశం పరువును,,అభివృద్దిని దిగజార్చేలా మాట్లాడడం శోచనీయమని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు.. హిండెన్‌బర్గ్ నివేదికపై ఆదివారం గ్వాలియార్ జ్యోతిరాదిత్య సింధియా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని.. దేశంలో అరాచకం వ్యాప్తి చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు..వివాదాస్పద వ్యవహారాల్లో దేశం నలిగిపోవాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటుందని విరుచుకు పడ్డారు.. దేశాన్ని పురోగతి పధంలో, అభివృద్థి మార్గాన నడిపించాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తా కోరుకుంటున్నారన్నారు..కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చి ప్రతి ఒక్కరినీ చీకట్లో మగ్గేలా చేస్తున్నదని ఆరోపించారు..కాంగ్రెస్ పార్టీ వైఖరి తొలి నుంచీ ఇదేనని, విచ్ఛిన్నకర విధానాలతోనే ఆ పార్టీ ముందుకెళుతున్నదని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
https://x.com/i/status/1822556084286161380