రూ.91 తో రీచార్జ్ చేయించుకుంటే చాలు 90 రోజుల పాటు వేలిడిటీ-BSNL
అమరావతి: జూలైలో జియో,ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు టారిఫ్ ధరలను అమాతంగా పెంచేశాయి.. దీంతో వినియోగదారులు BSNL బెటర్ గా వుంటుందని భావించి పోర్ట్ ఆప్షన్ ఎంచుకుని దేశవ్యాప్తంగా 2.75 మిలియన్ల మంది BSNLకు మారిపోయారు.. వినియోగదారుల అవసరాలను గమించిన BSNL మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది..అతి తక్కువ ధరలకే రిచార్జ్ ప్లాన్లను అందిస్తూ జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలకు చుక్కలు చూపిస్తోంది..
ప్రస్తుతం రూ.100 కంటే తక్కువ ధరతో అనేక రీచార్జ్ ఆప్షన్స్ ను BSNLఅందుబాటులోకి తీసుకుని వచ్చింది.. నిజానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే BSNLకు వినియోగదారులు చాలా తక్కువ మంది ఉన్నారు.. అయినప్పటికి తక్కవ రిఛార్జీతో ఎక్కవ ఆప్షన్స్ ను అందిస్తూ ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతొంది..కేవలం రూ.91 తో రీచార్జ్ చేయించుకుంటే చాలు 90 రోజుల పాటు వేలిడిటీ వచ్చేస్తుంది..ఈ ప్లాన్ BSNL అందిస్తున్న బంపర్ ఆఫర్ అనుకోవాలి..ఇంత తక్కువ ధరకు 90 రోజుల వ్యాలిడిటీని ఏ సంస్థ కూడా అందించడం లేదు..తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పాటు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారులు ఈ ప్లాన్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు..ఇది మాత్రమే కాకుండా నిమిషానికి 15 పైసలకే వాయిస్ కాల్స్, ఒక పైసాకే ఒక ఎంబీ డేటా, 25 పైసలకే ఎస్ఎమ్మెస్ వంటివి BSNL ఆఫర్ చేస్తోంది..కాల్స్ మాత్రమే లేదంటే డేటా లేదంటే ఎస్ఎమ్మెస్ కోసం టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్‌ను విడివిడిగా కొనుగోలు చేయాలి..ఇవి చాలా తక్కవ ధరలకు అందుబాటులో ఉన్నాయి..తాజాగా రూ.107 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను సైతం BSNL అందుబాటులోకి తీసుకొచ్చింది.. 107 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 35 రోజుల వేలిడిటీతో 3జీబీ 4జీ డేటాతో పాటు రోజుకు 200 నిమిషాల వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.