తుంగభద్ర డ్యామ్ వద్ద 19వ గేట్ కొట్టుకుపోవడంతో లక్ష క్యూసెక్కుల నీరు వృథా
అమరావతి: కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు..గేట్ లేకపోవడంతో రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది.. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా విడుదల చేయాల్సి వస్తొంది..కర్ణాటక శివమొగ్గలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది.. తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద కొనసాగుతోంది..వరద ఎక్కువగా ఉండడంతో గేట్ మరమ్మతులకు ఆటంకం కలుగుతోంది.. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు అధికారులు ఖాళీ చేసిన తరువాత కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది..
తుంగభద్ర డ్యామ్ వద్ద కొట్టుకుపోయిన గేటు ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటివ్ సి.ఎం డి.కే శివకుమార్, ఎమ్మెల్యే రాఘవేద్ర హిట్నాల్, మంత్రి శివరాజ్ తంగడగి పరిశీలించారు..మరోవైపు తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది..ముఖ్యమంత్రి చంద్రబాబు, గేట్ కొట్టుకుపోయిన విషయంపై మంత్రులు రామనాయుడు,,పయ్యావుల.కేశవలను ఆప్రమత్తం చేశారు..ఎప్పటికప్పుడు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా చేయాలని సూచించారు..గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది..తుంగభద్రత డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. అదేవిధంగా కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
శనివారం చోటు చేసుకున్న సంఘటనపై తుంగభద్ర ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం డ్యామ్ కు ఉన్న 33 గేట్ల నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. 69 ఏళ్ల నాటి డ్యామ్ చరిత్రలో ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రథమం అని అన్నారు..