AP&TG

పుట్టిన రోజున యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీ.ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్బంగా తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శుక్రవారం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి.వెంకట్‌రెడ్డి, తుమ్మల.నాగేశ్వరరావుతో పాటు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు.. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు..ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధనను ముందుగా దర్శించుకుని,,దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ప్రధానాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు..ముఖ్యమంత్ర వెంట మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.. ధర్మారెడ్డిపల్లి కాల్వ వెంట సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు..జనంలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు రైతులతో స్వయంగా ముఖ్యమంత్రినే సమావేశం కావడం అదే సమయంలో క్షేత్రస్థాయిలో వాస్తవ సమస్యలు తెలిసి వస్తాయని, వాటిని అధిగమించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలిసొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *