లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై జరుగుతున్న సిట్ విచారణకు బ్రేక్-DGP
సుప్రీమ్ కోర్టు పరిధిలో…
అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతొంది..శ్రీవారి లడ్డూ వివాదం, సుప్రీమ్ కోర్టుకు చేరడంతో సిట్ విచారణ ఆగిపోయింది..సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ జాతీయనేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటీషన్లు దాఖలు చేశారు..
కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో సిట్ దర్యాప్తును ఆపేసినట్లు DGP ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.. రికార్డులు పరిశీలించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి సిట్ బృందం అన్ని వివరాలు తీసుకుంది.. ఒక సంస్థకు టెండర్లు దక్కితే మరో సంస్థ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది..
AR డెయిరీకి నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా, కావాలనే టెండర్ నిబంధనలు సవరించి టెండర్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.. అలాగే నెయ్యి కూడా AR డెయిరీ నుంచి రావడం లేదని, శ్రావణి డెయిరీ అనే సంస్థ నుంచి సరఫరా అవుతున్నట్లు వార్తలు వచ్చాయి..నెయ్యి క్వాలిటీకి సంబంధించి సరైన టెస్టులు చేయకుండానే నెయ్యిని లడ్డూల తయారీకి వాడుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి..ఈ నెల 3వ తేదిన సుప్రీంలో విచారణ ఉంది..సుప్రీమ్ కోర్టు నిర్ణయం ఎలా వుండబోతుందా అనే ఉత్కఠం సర్వత్ర నెలకొంది.