ఎన్డీయే ప్రభుత్వంలో పదవి అనేది బాధ్యత-చంద్రబాబు
కార్పొరేషన్ల ఛైర్మన్లకు శుభాకాంక్షలు..
అమరావతి: నూతనంగా ఎంపికైన 20 కార్పొరేషన్ల ఛైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు చేపట్టిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పదవిని అహంకారంగా భావించకుండా బాధ్యతతో మెలగాలని వారికి సూచించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పదవి అనేది బాధ్యత,, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదు,, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే గుర్తు పెట్టుకోవాలి,,ప్రజల కంటే మనం ప్రత్యేకమని భావించకూడదని,, మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారుంటారని చెప్పారు. మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హుందాగా ఉండాలన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామన్నారు. రెండవ లిస్టులో కష్టపడిన వారికి తగిన ప్రాధన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.