పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి దుర్గేషే
నెల్లూరు: రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ బుధవారం రాత్రి 8 గంటలకు నెల్లూరు చేరుకుని బస చేస్తారు.గురువారం (26.వ తేదీ) ఉదయం 9 గంటలకు నెల్లూరు నుండి బయలుదేరి 11 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరి చేరుకుని పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.అనంతరం జాతరలో పాల్గొంటారు.3 గంటలకు వెంకటగిరి నుండి బయలుదేరి విజయవాడ వెళతారు.