విడాకులు తీసుకుంటున్న ఊర్మిళ మటోండ్కర్ !
అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం రంగీలాలో “యాయి రే యాయి రే” అంటూ యువకులను ఉర్రూతలూగించిన భామ ఊర్మిళ మటోండ్కర్,,ప్రస్తుతం వార్తల్లో హైలెట్ అవుతోంది..మోడల్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిన తన భర్త మోసిన్ అఖ్తర్ మీర్ కి విడాకులు ఇచ్చినట్లు వార్తలు వాస్తున్నాయి..4 ఫిబ్రవరి, 2016లో ఈ జంట ఊర్మిళ నివాసంలోనే దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు..తనకంటే 10 సంవత్సరాలు చిన్న వాడైనా,అతని వ్యక్తిత్వం,,విలువలు కలవడంతో మోసిన్‌ను ఊర్మిళ పెళ్లాడింది..8 సంవత్సరాల వివాహ బంధం అనంతరం ఈ జంట మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసినట్లు సమాచారం..ఈ విడాకులకు తీసుకునేందుకు అసలు కారణాలేంటనేది తెలియాల్సి ఉంది..