46 ఏళ్ల తరువాత తెరచుకున్న జగన్నాథుడి రత్న భండార్
అమరావతి: పూరీ జగన్నాథుడి రత్న భండార్..ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు..3వ గదిలోకి కలెక్టర్,, 11 మందితో కూడిన హైలెవెల్ కమిటీ పర్యవేక్షణలో తలుపులు తెరిచారు..అక్కడ సర్పాలు లాంటివి ఏవి కన్పించలేదని తెలుస్తొంది..ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు.. జగన్నాథుడి రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి.. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు..3వ గదిని మాత్రం 1978లో ఒక సారి తెరిచారు..తరువాత మళ్లీ తెరవలేదు..ఈ గదికి నాగ బంధం కూడా ఉండడంతో,, అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు.. ఆ గదిలో నిధులు, నిక్షేపాలకు రక్షణగా పాములున్నాయని ప్రచారం..3వ గది తలుపులను తెరిచే సమయంలో పూరీ ఎస్పీ సొమ్మసిల్లి పడిపోయినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.. తరువాత మళ్లీ కోలుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు..
వందల ఏళ్లనాటి అపార సంపద,,ఆ పురాతన ఆభరణాలపై ఎన్నో ఊహాగానాలు,,లెక్కలేనన్ని మణులు మాణిక్యాలు, వజ్ర, వైఢూర్యాలున్న రత్న భండార్ రహస్యం ఇన్నాళ్లు మిస్టరీగానే ఉండిపోయింది..దేశ ప్రజలకు అందులో ఉన్న సంపద ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు..బ్రిటిష్ కాలంలో 1805 జూన్ 10న తొలిసారి,,1926లో మరోసారి లెక్కించినట్లు రికార్డులు వున్నాయి.. చివరిసారిగా 1978 మే 13, జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు,,వెండి,, బంగారం నిల్వలను లెక్కించి,,9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్కపెట్టెల్లో భద్రపరిచారు..నాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది..3వ గదిని మాత్రం ఇప్పటివరకు తేరవలేదు..