సోమశిల డ్యాం ఆఫ్రాన్ నిర్మాణాన్ని 60 రోజుల్లో పూర్తిచేసేందుకు చర్యలు-మంత్రి రామానాయుడు
నెల్లూరు: గత ప్రభుత్వ పాలనలో సోమశిల జలాశయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని,,త్వరిత గతిన ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడనుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.ఆదివారం సోమశిల జలాశయాన్ని మునిసిపాల్ శాఖ మంత్రి పొంగూరు.నారాయణ ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి,సోమిరెడ్డి,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులతో కలసి పరిశీలించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ డ్యాం రోప్స్, షట్టర్లు, గేట్ల మరమ్మత్తులు కూడా చేపట్టలేదని,,కనీసం గ్రీస్ కూడా పూయలేదని వైసీపీ నాయకులపైన మండిపడ్డారు.ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని 60 రోజుల్లో సోమశిల జలాశయ ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అన్నారు.సోమశిల డ్యాం పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యతా క్రమంలో సోమశిల జలాశయ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.శాసనసభ్యులు, రైతులు, సాగునీటి సంఘం నేతలు గతంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అనేక అక్రమాలపై ఫిర్యాదులు చేశారన్నారు.ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.