వేంకటేశ్వర పురం బ్రిడ్జి వద్ద దారి మళ్లీంపు-NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్
నెల్లూరు: నెల్లూరు నగరం నుంచి బుచ్చి, సంగం, ఆత్మకూరు, కడప, కర్నూలు రూట్ వెళ్ళు మార్గములో వేంకటేశ్వర పురం పాలిటెక్నిక్ కాలేజీ వద్ద వున్న రైల్వే బ్రిడ్జి దెబ్బతినడం వల్ల వాహనములు అనుమతించడం లేదని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు..ఈ రోడ్డు మీదగా ప్రయాణించే వాహనాలను ప్రధానంగా రెండు మార్గాలలో దారి మల్లించడం జరిగిందన్నారు.
1) ఇరుకుల పరమేశ్వరి దేవస్థానం ముందు మార్గంలో ( వయా జొన్నవాడ), బుచ్చి రూట్లో..
2) పాత పెన్నా బ్రిడ్జి నుంచి నేరుగా ఇనమడుగు సెంటర్ మీదుగా, NH 16 (పాత NH 5) సర్వీస్ రోడ్డు, కోవూరు సాయిబాబాగుడి మీదగా కోవూరు టౌన్ రోడ్డు, సాలిచింతల మీద బుచ్చి రూట్లోకి వెళ్ల వచ్చన్నారు. స్కూల్, కాలేజీ,, ఆసుపత్రుల యాజమాన్యాలు,, అంబులెన్సు,,అగ్నిమాపక వంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వారు ఈ రూట్ లను వినియోగించుకోవాలని కోరారు.