బీజెపీ జాతీయ అధ్యక్షడిగా తమిళ సింగం “అన్నామలై”ను నియమిస్తారా ?
అమరావతి: స్వపక్షంలోని నాయకులతో పాటు విపక్ష పార్టీలకు సైతం అందని విధంగా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసకొవడంలో నరేంద్రమోదీ యంత్రంగం నిశబ్దంగా పని చేస్తూ పొతుంది అనేందుకు 2014 నుంచి అనేక నిదర్శనలు కన్పిస్తునే వున్నాయి..2018లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీఅథిత్యనాధ్ ను నియమించడం,, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవిస్ ను ఉప ముఖ్యమంత్రిగా పార్టీ తరపును పనిచేయాలని అదేశించండం..మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను నియమించడం,,అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించడం లాంటివి కొన్ని మచ్చుతునకలే..2022లో తమిళనాడులో ఎవరు ఉహించన విధంగా అన్నామలైను రాష్ట్ర అధ్యక్షడిగా నియమించడంతో,,తమిళనాడులు 30 సంవత్సరాలకు పైగా పార్టీలో పనిచేస్తూన్న బీజెపీ నాయకులు పెద్దగా ఇష్ట పడలేదు..అన్నామలై లాంటి అనుభవం లేని వ్యక్తి,,ద్రవిడపార్టీలను ఎదుర్కొని,,తమిళనాడులో బీజెపీని ఎలా బలంగా తయారు చేస్తారంటూ పెదవి విరిచారు..అయితే కాలక్రమేణ అన్నామలై,బీజెపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి చేపట్టిన మార్పులతో అప్పటి వరకు తమిళనాడులో 3 నుంచి 4 శాతం వున్న బీజెపీ బలం,2024 ఎన్నికల నాటికి 11 శాతంకు పెరిగింది.. అప్పటి వరకు తమిళనాడులో తోక పార్టీ(సీట్లు డిమాండ్ చేయలేని)ల వున్న బీజెపీ నేడు ఎన్నికలు జరిగితే మాకు ఇన్ని సీట్లు ఇస్తేనే పొత్తు కుదుర్చుకుంటాము అనే స్థాయికి ఎదిగింది అంటే అది అన్నామలై కృషే అని చెప్పుకొవాలి..అలాగే గత నెలలో ఎవరు ఉహించని విధంగా కేరళలో వ్యాపారవేత్త అయిన రాజీవ్ చంద్రశేఖరన్ కేరళ రాష్ట్ర బీజెపీ అధ్యక్షడుగా నియమించి,,అటు అధికార కమ్యూనిస్టులకు ఇటు కాంగ్రెస్ పార్టీకి 2026లో జరిగే ఎన్నికలకు సవాల్ విసిరింది..
అన్నామలై:- తమిళనాడు అధ్యక్షడుగా పనిచేస్తున్న అన్నామలై టర్మ్ పూర్తి అయింది..కొత్త వ్యక్తిని పార్టీ అధ్యక్షడిగా నియమిస్తారా? లేకు అన్నామలైనే తిరిగి అధ్యక్షడిగా కొనసాగిస్తారా అనే విషయంపై తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చలు,, ఉహగానాలు జరుగుతొన్నాయి..ఇదే సమయంలో గత నెల అన్నాడిఎంకె పార్టీ అధ్యక్షడు పళనీస్వామి,తన పార్టీ నాయకులతో కలసి ఢిల్లీలో అమిత్ షాను కలవడం ప్రాధన్యత సంతరించుకుంది..ఒంటరిగా 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే,,తమకు ఘోర పరాజయం తప్పదని భావించడంతో,పళనీస్వామి పార్టీ,,బీజెపీతో పొత్తు కోసం మంతనాలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతొంది.. ఇదే సమయంలో ఏఐఎడిఎంకే పార్టీ సిద్దాంతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన అన్నామలై అంటే పళనీస్వామి వర్గానికి పడదు కాబట్టి,,ఎట్టి పరిస్థితుల్లో అన్నామలైను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి తప్పిస్తారు అంటు జాతీయస్థాయి పత్రికలు స్టోరీ ప్రచురిస్తున్నాయి..
బీజెపీ వ్యూహం??—దక్షణాది రాష్ట్రం అయిన తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజెపీ అగ్ర నాయకత్వం,, తమిళలకు బీజెపీ అత్యంత ప్రాధన్యం ఇస్తుంది అని చెప్పెందుకు అన్నామలైకు బీజెపీ జాతీయ అధ్యక్ష పదవీ కట్టపెట్టిన ఆశ్చర్యంలేదు?ఒక వేళ ఇదే జరిగితే తమిళనాడులో రాజకీయాల్లో ఉహించిన రాజకీయ మార్పులు,,సమీకరణలు చోటు చేసుకొవడం ఖయంగా కన్పిస్తొంది..అయితే అందరి వ్యుహలు తల్లక్రిందులు చేసే బీజెపీ అగ్రనాయకత్వం త్వరలోనే బీజెపీ జాతీయ నాయకుడుని ఏ రూపంలో ప్రకటిస్తుందొ వేచి చూడాలి మరి..??