విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన పీవీ సింధు
అమరావతి: విశాఖపట్నంలోని విశాఖ రూరల్ మండలం చినగదిలి మండలంలోని తోటగరువు సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి గురువారం భూమిపూజ చేశారు..సంవత్సరం లోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదని పీవీ సింధు తెలిపారు. స్థానికులు అడుగుతున్నట్లు కళాశాలకు వేరే చోట కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపామని పీవీ సింధు చెప్పారు. పీవీ సింధు మాట్లాడుతూ.. భూమి పూజ చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అకడామీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించదని తెలిపారు. ఈ అకాడమీతో భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారాలు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి వచ్చి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అకాడమీ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.