గిరిజనుల కోసం ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక-సోమిరెడ్డి
కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు…
నెల్లూరు: ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు తదితర ధ్రువీకరణ పత్రాలు లేని గిరిజనులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తొందని సర్వేపల్లి ఎమ్మేల్యే సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి అన్నారు..శుక్రవారం వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలసి ఎమ్మేల్యే సోమిరెడ్డి ప్రారంభించారు..ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు అన్ని సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదికన నిర్వహిస్తున్నామన్నారు..రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యం అన్నారు..గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచి పేదరికం నుంచి ఆయా కుటుంబాలు బయటపడేందుకు విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..సర్వేపల్లి నియోజకవర్గం 5 మండలాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు.. గిరిజనుల అర్జీలు ఆన్లైన్ నమోదు కోసం 15 ప్రత్యేక కౌంటర్లు,,ఆధార్ కార్డుల నమోదు కోసం 5 ప్రత్యేక కౌంటర్లు,,25మంది సచివాలయ ఉద్యోగులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు..అలాగే ప్రతి అర్జీ ఆన్లైన్లో నమోదు చేస్తూ, వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు..నగరపాలక కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.