దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి: అక్టోబర్ 3వ తేది నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది..ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి..13వ తేది వరకు మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది..తిరిగి ఈనెల 14వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు,, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తించనుంది..
తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులను ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించేసింది.. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ రేవత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..15వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.