విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఎన్నికలకు ముందు నుంచి విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని,,ఈ విషయంలో కేంద్రప్రభుత్వంను ఒప్పిస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్, వైజాగ్ ప్రజలకు,,స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన మాట ఎట్టకేలకు సాకారం అయింది..
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్రభుత్వం ఆపరేషనల్ పేమెంట్స్ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది..ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు..స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి,, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు..నష్టాలను అధిగమించి,, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు ఆర్థిక ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధితో ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి,, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది అనేందుకు ఇదే నిదర్శనం’’ అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.