శ్రీశైలం ఎడమ వైపు సొరంగం వద్ద మట్టి పెళ్లులు విరిగి పడి భారీ ప్రమాదం
తెలంగాణ: శ్రీశైలం,దోమలపెంట దగ్గర శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కు సంబంధించి పనులు జరుగుతున్న సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది..ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది..ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది..4 రోజుల క్రితం ఈ పనులు మొదలు కాగా శనివారం ఉదయం సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది..ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించిన అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు..ఎడమగట్టు కాలువ టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు,,తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు..ఫస్ట్ షిఫ్ట్ లో భాగంగా సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు వెళ్లారు.. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి కార్మికులపై పడడం మొదలు కాగానే టన్నెల్ నుంచి 50 మంది కార్మికుల్లో 42 మంది బయటకు వచ్చారు..మిగిలిప 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.. ఘటనాస్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు..పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు..సమాచారం పూర్తిగా తెలియాల్సి వుంది.