మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను విడుదల చేసిన మంత్రి నారా.లోకేష్
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను శనివారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు..అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://apdsc.apcfss.in లేదా వాట్సాప్ (95523 00009 మెసేజ్) ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్,, పుట్టిన తేదీతో లాగిన్ అయిన తరవాత వారి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి..డీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసిన సందర్భంలో ఐటీ,విద్యాశాఖ మంత్రి లోకేష్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు..‘మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల మా నిబద్ధతకు ఇదే నిదర్శనం అన్నారు.. డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి’ అని ఆకాంక్షించారు..మెగా డీఎస్సీ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి..అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.inలో అందుబాటులోకి వచ్చాయి..