తెలంగాణకు రూ.కోటి,ఏ.పికి మరో రూ.4 కోట్లు సాయం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్
అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను చూసిన తరువాత తాను గతంలో ప్రకటించిన రూ.కోటి కంటే మరింత సాయం అందించాలన్న ఉద్దేశంతో ఏ.పికి మరో రూ.4 కోట్లు,,తెలంగాణకు రూ.కోటి రూపాయలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు.బుధవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల గ్రామాలలోని తాగు నీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన అంనతరం అయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు.. ఏపీలో 3,312కి.మీ. మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు, భవనాల శాఖకు తీవ్రం నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు..1.69 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోవడం జరిగిందని,,18,424హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు.. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 233కి.మీ. మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు..వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60 పడవలు దెబ్బతిన్నట్లు తెలిపారు..యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టామని,,బాధితలను అన్ని విధాల ప్రభుత్వం అదుకుంటుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు..వరద ముంపు వల్ల దెబ్బతిన్న ప్రాంత ప్రజలను అదుకునేందుకు ఉద్యోగ జెఏసి తరపున రూ.14 కోట్లు,, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రూ.75 లక్షలు,ఆర్.డబ్యూ.ఎస్ ఉద్యొగుల సంఘం రూ.10 లక్షలు విరాళం ప్రకటించడాన్ని డిప్యూటీ సీఎం అభినందించారు.