ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్,,తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత మంది అభ్యర్దుల పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి..ఇప్పటి వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేసిన నాయకులు నిరసించి పోయారు..
తెలంగాణ:- అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది..విపరీతమైన పోటీ వున్న ఎమ్మేల్సీ అభ్యర్ది విషయంలో విజయశాంతి పేరును ఖరారు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది..ఒక సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం నిర్ణయించుకున్నట్లు సమాచారం..సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకటి జనసేన,,ఒకటి బీజెపీకి కేటాయించగా ముగ్గరు టీడీపీ అభ్యర్దుల పేర్లను తెలుగు దేశం పార్టీ ప్రకటించింది..కావలి గ్రీష్మ,,బీదా రవిచంద్ర,,బీటీ నాయుడు పేర్లను ఆదివారం సాయంత్రం పార్టీ ప్రకటించింది..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె కావలి గ్రీష్మ..ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర,,చిత్తూరు జిల్లాకు చెందిన బీటీ నాయుడులను ఎంపిక చేయడంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు అయింది..జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు..బీజెపీ తరపును ఆ పార్టీ అభ్యర్దిన ప్రకటించాల్సి వుంది..మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి..మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.