వైసీపీ నేతలకు హైకోర్టులొ గట్టి ఎధురు దెబ్బ
అమరావతి: వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందికి హైకోర్టు గట్టి ఎధురు దెబ్బ తగిలింది..టీడీపీ కేంద్ర కార్యాలయంపై,, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది..ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పస్టం చేసింది..ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది..బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు..ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు.. అయితే, సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని తీర్పు కాపీని హైకోర్టుకు టీడీపీ న్యాయవాదులు అందజేశారు..తీర్పులను పరిశీలించిన ధర్మాసనం, తన తీర్పును వెలువరించింది..అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడారు..చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ధర్మానసం, జోగి రమేష్‌కు బెయిల్ తిరస్కరించింది..హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.