AP&TG

మావోయిస్ట్ అగ్రనేత దాదా రణదేవ్ మృతి ?

హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత, మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి..ఏసోబ్ హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని,,మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడని దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ పేర్కొన్నారు.. ఆయన మరణంపై మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు..మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది..ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఎన్‌కౌంటర్‌తో మరణించిన మొత్తం 9 మంది మృతుల పేరు, రివార్డు వివరాలను పోలీసులు ప్రకటించారు..

1.రణధీర్ (హోదా-డీకేఎస్‌జెడ్‌సీఎం), వరంగల్ నివాసి- రివార్డ్ రూ.25 లక్షలు,,2. కుమారి శాంతి (హోదా -31 పీఎల్ సభ్యుడు) – రివార్డు రూ.5 లక్షలు,,3. సుశీల మడకం, భర్త జగదీష్ (హోదా- ఏసీఎం) – రివార్డ్ రూ.5 లక్షలు,,4. గంగి ముచకి (హోదా- కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు)- రివార్డ్ రూ.5 లక్షలు,,5. కోసా మాద్వి (హోదా- మలంగిర్ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు) – రివార్డ్ రూ.5 లక్షలు,,6. లలిత (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు) – రివార్డ్ రూ.5 లక్షలు,,7. కవిత (హోదా- గార్డ్ ఆఫ్ ఏవోబీఎస్‌జెడ్‌సీ – రివార్డ్ రూ.5 లక్షలు,,8. హిడ్మే మంకం (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు – రివార్డ్ రూ.2 లక్షలు,,9. కమలేశ్ (హోదాప్లాటూన్ సభ్యుడు) బీజాపూర్ జిల్లావాసి – రివార్డ్ రూ.2 లక్షలు,,

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారంటూ సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ నిర్వహించారు..ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి..ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్‌, 12 తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *