AP&TG

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా బోర్డుకు లేఖ రాసి ప్రభుత్వం!

అమరావతి: రాష్ట్రంలో అదివారం ఫిబ్రవరి 23వ తేదిన జరగనున్న గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిదిద్దకుండా పరీక్ష నిర్వహించడం దారుణమని కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. వారి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటూ ఏపీపీఎస్సీకి ఈ లేఖ రాసింది.. ప్రస్తుతం అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న రోస్టర్ సమస్య కోర్టు విచారణలో ఉంది.. వచ్చే నెల 11వ తేదిన ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రానుంది.. దీంతో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *