మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం-మంత్రి ఎన్ఎండీ ఫరూక్
రూ.92 లక్షలు విడుదల…
అమరావతి: రాష్ట్రంలో మరణించిన 23 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ.92 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఏపీ అడ్వకేట్స్ సంక్షేమ నిధికి విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతిలో విడుదల చేసినట్లు తెలిపారు. మరణించిన ఒక్కొక్క న్యాయవాది కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున వారి నామినీలకు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యవేక్షణలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు సంబంధించిన నామినీలకు పరిహారం మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి ఫరూక్ తెలిపారు.